'వివేకా హత్యకేసు విచారణను.. సీఎం సీబీఐకి ఎందుకు ఇవ్వడం లేదు' - మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వార్తలు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును..సీబీఐకి అప్పగించాలంటూ వివేకా కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించారు. గతంలో సీబీఐ దర్యాప్తు జరపాలని వ్యాజ్యం వేసిన వైఎస్ జగన్ ఇప్పుడు సీబీఐకి అప్పగించడంపై ఎందుకు విముఖత చూపుతున్నారని న్యాయస్థానం.. ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ వివేకా కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించారు. ఇదే అంశంపై సీఎం కాక ముందు జగన్, వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, తెదేపా నేత బీటెక్ రవి, భాజపా నేత ఆదినారాయణ రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలతో కలిపి విచారిస్తామని హైకోర్టు తెలిపింది. గతంలో సీబీఐ దర్యాప్తు కావాలని వ్యాజ్యం వేసిన వైఎస్ జగన్... ఇప్పుడు సీబీఐకి అప్పగించడంపై ఎందుకు విముఖత చూపుతున్నారని న్యాయస్థానం..ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. కౌంటర్లు వేయని వ్యాజ్యాలపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 6 కు వాయిదా వేసింది.