ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణాజిల్లాలో యువ ఓటర్లే కీలకం..! - panchayat elections in krishna district

ఎన్నికల్లో అతి కొద్ది శాతం ఓట్ల తేడాతోనే ఫలితాలు తారుమారైపోతున్న సంఘటనలు చూస్తున్నాం. ఒక్కోసారి ఒక్క ఓటు కూడా కీలకం అవుతుంది. అందుకే పంచాయతీ ఎన్నికల్లో ఓటుహక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటువేసేలా గ్రామాల్లోని రాజకీయ పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. దీనికితోడు ఈసారి కృష్ణాజిల్లాలో నమోదైన ఓట్లను పరిశీలిస్తే యువత స్వచ్ఛందంగా నమోదు చేసుకునేందుకు ముందుకు వచ్చారు. ఇది శుభపరిణామంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

youth
యువ ఓటర్లు

By

Published : Feb 4, 2021, 2:21 PM IST

ప్రస్తుతం కృష్ణా జిల్లావ్యాప్తంగా ఉన్న ఓట్లలో 40శాతం ఓట్లు 18 నుంచి 39 ఏళ్లలోపువారివే ఉన్నాయి. అంటే వీరి ఓట్లు ఎన్నికల్లో కీలకం కానున్నాయి. సాధారణంగా గతంలో ఓటు నమోదు చేసుకోవాలంటే స్థానిక పాలకులు, నాయకులు వెళ్లి దరఖాస్తు పూర్తి చేయించేవారు. అది కాలక్రమేణా మారుతూ వచ్చింది. ప్రస్తుతం ఓటు నమోదుకు అంతర్జాలం ద్వారా అనేక అవకాశాలు కల్పించడంతో నమోదు చేసుకునే యువత పెరుగుతున్నారు. 21వేలకుపైగా 18 నుంచి 19 ఏళ్లలోపు వారు ఉంటే 20 నుంచి 29 ఏళ్లలోపు 7లక్షలకుపైగా ఉన్నారు. ఓటుహక్కు పొందడంలో చూపించిన ఉత్సాహం పోలింగ్‌బూత్‌ వరకు వెళ్లి ఓటు వేయడంలో కూడా చూపించాలి.

ఓట్లు దక్కించుకునేందుకు పాట్లు

యువత ఓట్లే ఆయా పార్టీల గెలుపును నిర్ధేశిస్తాయని పలువురు రాజకీయ నాయకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించేందుకు వారి ఓట్లు దక్కించుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. బృందాలకు నాయకత్వం వహించేవారితో మాట్లాడి వారికి క్రీడా పరికరాలతోపాటు పలు తాయిలాలు ఇచ్చేందుకు సంప్రదింపులు చేస్తున్నారు. ఇలా యువత ఆకాంక్షను బట్టి వారి అవసరాలు తీర్చి ఓట్లు వేయించుకోవాలని ఎవరికి వారు తాపత్రయ పడుతున్నారు. కొన్ని చోట్ల యువత కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో తలపడేందుకు ఉత్సాహం చూపిస్తుండగా గ్రామాల్లో ప్రభావితం చేయగల యువకులను అభ్యర్థులుగా నిలబెట్టేందుకు ఆయా పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

నియోజకవర్గం వారీగా ఓటర్ల జాబితా

ఇదీ చదవండి:గుడివాడ డివిజన్​లో సర్పంచి పదవికి 214.. వార్డులకు 952 నామినేషన్లు

ABOUT THE AUTHOR

...view details