కృష్ణా జిల్లా పామర్రులో.. హారన్ కొడితే ద్విచక్రవాహనాలకు దారి ఇవ్వలేదని బస్సు అద్దాలు ధ్వంసం చేసిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పామర్రు నుంచి విజయవాడ వెళుతున్న ఆర్టీసీ బస్సు అద్దాలు ద్వంసం చేయటంతో పాటు డ్రైవర్‌పై యువకులు దాడి చేశారు. డ్రైవర్ ఫిర్యాదుతో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు పోలీసులు తెలిపారు. చట్టవ్యతిరేకమైన పనులు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
దారి ఇవ్వలేదని బస్సు అద్దాలను ధ్వంసం చేసిన యువకులు - పామర్రు వార్తలు
హారన్ కొడితే స్కూటీలకు దారి ఇవ్వలేదని బస్సు అద్దాలను ధ్వంసం చేసిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. డ్రైవర్ ఫిర్యాదుతో ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి... రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
బస్సు అద్దాలను ధ్వంసం చేసిన యువకులు