ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తండ్రి తప్పని చెప్పినందుకు తనయుడు తనువు చాలించాడు' - telanagana makthabhupathipur news

తెలంగాణ మెదక్​ జిల్లా మక్తభూపతిపూర్​లో ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్​లో డబ్బులు పోయాయని తండ్రి మందలించినందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్టు పోలీసులు వెల్లడించారు.

youngman suicide in makthabhupathipur
మక్తభూపతిపూర్​లో యువకుడు మృతి

By

Published : Nov 23, 2020, 6:46 PM IST

బెట్టింగ్​లో డబ్బులు పోగొట్టాడని తండ్రి మందలించినందుకు...తెలంగాణ మెదక్​ జిల్లా మక్తభూపతిపూర్​లో జియ్యారి మహేష్​ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి తిట్టాడని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మహేష్​... చెరువులో దూకాడు. మృతుడికి ఆరు నెలల క్రితమే వివాహమైనట్టు తెలుస్తోంది.

ఆదివారం రాత్రి పది గంటల నుంచి కనిపించడం లేదని తండ్రి రామకృష్ణయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇవాళ ఉదయం చెరువులో మృతదేహం కనిపించిందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహేష్ మృతదేహంగా గుర్తించిన పోలీసులు... గ్రామస్థుల సాకారంతో బయటకు తీసి పోస్టుమార్టం కోసం మెదక్ ఆసుపత్రికి తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి:మౌజమ్ ఆత్మహత్యాయత్నం...సెల్ఫీ వీడియో వైరల్

ABOUT THE AUTHOR

...view details