ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"భర్త వదిలేశాడు... ప్రియుడు వద్దంటున్నాడు" - husband

సజావుగా సాగుతున్న ఆమె జీవితం దిక్కుతోచని స్థితిలో పడింది. వివాహేతర సంబంధం ఆమె జీవితాన్ని అనుకోని మలుపు తిప్పింది. భర్త కాదనడం... ప్రియుడు ముఖం చాటేయడంతో ఆమె నడిరోడ్డుపై మిగిలిపోయింది.

మహిళ

By

Published : Jul 26, 2019, 2:06 AM IST

యువతి ఆవేదన

కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గం పరిధిలోని అన్నపనేనివారి గూడెం గ్రామానికి చెందిన గురివిందపల్లి కవిత (22), అదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ సిసింద్రీ (23) ప్రేమించుకున్నారు. ఇద్దరూ పెళ్లిచేసుకోవాలని కలలు కన్నారు. పెద్దలు మాత్రం కవితకు మరొకరితో వివాహం చేశారు. వీరి సంసారం సజావుగానే సాగింది. ఈ దంపతులకు ఓ పాప కూడా ఉంది. కానీ కొన్నాళ్ల నుంచి సిసింద్రీ, కవితలు మళ్లీ సన్నిహితంగా ఉంటున్నారు. దీని ఫలితం... ఆమె గర్భవతి అయ్యింది. విషయం తెలిసి ఆమెతో భర్త తెగతెంపులు చేసుకున్నాడు. కడుపు దాల్చటంతో సిసింద్రీ సైతం కవితను పట్టించుకోవటం మానేశాడు. ఏం తోచని పరిస్థితుల్లో ప్రియుడి ఇంటి ముందు కవిత మౌనపోరాటానికి దిగింది. తనకు న్యాయం చేయాలంటూ ఇంటి ముందు నిరసన చేపట్టింది. ముసునూరు ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలికి నచ్చజెప్పారు. ఆమె ఆరోగ్యం క్షీణించటంతో ముసునూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details