కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఇందుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. గ్రామానికి చెందిన జ్ఞాన ప్రవీణ్ ఐపీఎల్‌లో బెట్టింగ్ కోసం రూ.8 లక్షలు రుణం తీసుకున్నాడు. రెండ్రోజుల క్రితం రూ.1.5 లక్షలు చెల్లించాడు. మిగతా డబ్బులు కట్టాలని నిర్వాహకులు వేధింపులకు గురిచేయటంతో మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించాడు. బాధితుడు ప్రస్తుతం పిన్నమనేని సిద్దార్థ వైద్యశాలలో చికిత్సపొందుతున్నాడు. కాగా ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల వేధింపులు.. యువకుడి ఆత్మహత్యాయత్నం - క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల వేధింపులు
క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన కృష్ణా జిల్లా ఇందుపల్లిలో చోటు చేసుకుంది. ఐపీఎల్‌లో బెట్టింగ్ కోసం రూ.8 లక్షలు రుణం తీసుకున్న యువకుడు అప్పు తీర్చే మార్గం లేక బలవన్మరణానికి యత్నించాడు.
![క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల వేధింపులు.. యువకుడి ఆత్మహత్యాయత్నం క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల వేధింపులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15551683-939-15551683-1655136336856.jpg)
క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల వేధింపులు