విజయవాడ శివారులోని ఎనికేపాడు వద్ద కొందరు యువకులు హల్ చల్ చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్.. తమ వాహనాలకు దారి ఇవ్వలేదని వాగ్వాదానికి దిగారు. ఎంతసేపు హారన్ కొట్టినా ట్రావెల్స్ డ్రైవర్ దారి ఇవ్వలేదంటూ.. ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ ప్లాజా వరకు వెంబడించారు. టోల్ ప్లాజా వద్ద బస్సుకి ఎదురుగా వాహనాలు అడ్డుగాపెట్టి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు యువకులను అదుపులోకి తీసుకున్నారు. పటమట స్టేషన్‌కు తరలించారు.
బస్సుకు వాహనాలు అడ్డంపెట్టిన యువకులు... అదుపులోకి తీసుకున్న పోలీసులు - krishna district latest news
తమ వాహనాలకు దారి ఇవ్వలేదని కొంతమంది యువకులు బస్సు డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
వాగ్వాదం జరిగిన ప్రదేశం