ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నమ్మించాడు.. నగలు దోచుకొని చంపేశాడు - latest news in vijayawada

పరాయి రాష్ట్రానికి చెందిన వాడైన ప్రేమించాననే సరికి నమ్మింది. పెళ్లి చేసుకుందాం.. నీ వాళ్లు ఒప్పకొరు.. నా సొంతూరు తీసుకెళ్తానంటే.. నగలతో సహా పయనమయింది. ఆమెను వెత్తుకుంటూ వెళ్లిన తల్లిదండ్రులకు.. చివరికి అస్థికలే మిగిలాయి. అసలేమైంది?

cheating
మోసం చేసి చంపాడు

By

Published : Jul 28, 2021, 8:48 PM IST

విజయవాడ వన్ టౌన్ చిట్టినగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతిని.. యూపీకి చెందిన ఎండీ వఫీస్ అనే వ్యక్తి ప్రేమించానని నమ్మించాడు. అతడు స్థానికంగా చిరు వ్యాపారం చేసేవాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని.. ఈనెల పదో తేదీన ఇంటి నుంచి తీసుకెళ్లిపోయాడు. ఆ యువతి తండ్రి తొలుత పోలీసులకు ఫిర్యాదు చేసి.. అనంతరం తన స్నేహితులతో కలిసి.. కుమార్తెను వెతకటం ప్రారంభించాడు. చివరికి ఉత్తరప్రదేశ్​లో ఉన్న సహరంపుర్, ప్రాంతంలో ఉన్నట్లుగా తెలుసుకొని అక్కడికి చేరుకున్నాడు. వఫీస్​ను పట్టుకొని స్థానిక సహరంపుర్, కోతవలి మండి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. వారు అతడిని తమదైన రీతిలో విచారించగా.. యువతిని చంపినట్లు ఒప్పుకున్నాడు. యువతికి సంబంధించిన బంగారాన్ని కూడా అతని వద్దనే ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. విజయవాడ పోలీసులు వస్తే కేసు ముందుకు సాగుతుందని యూపీ పోలీసులు స్పష్టం చేశారని బాధితులు తెలిపారు. యువతి సంబంధించిన మిస్సింగ్ ఎఫ్ఐఆర్ కాపీని సంబంధిత పోలీస్ స్టేషన్ కి మెయిల్ పెట్టామని విజయవాడ పోలీసులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details