కృష్ణాజిల్లా మైలవరంలో ఎస్సై కొట్టాడని మనస్తాపంతో ఉప్పుతల శివ అనే యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. ద్విచక్ర వాహనాన్ని తగలబెట్టిన కేసు ఒప్పుకోవాలని మైలవరం ఎస్సై రాంబాబు కొట్టినట్లు ఆ యువకుడు ఆరోపించాడు. మళ్లీ కొడతారనే భయంతో ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు శివ తెలిపాడు.
ఎస్ఐ కొట్టాడని.. మైలవరంలో యువకుడు ఆత్మహత్యాయత్నం - కృష్ణాజిల్లా నేర వార్తలు
కృష్ణాజిల్లా మైలవరంలో ఎస్సై కొట్టాడని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ద్విచక్ర వాహనాన్ని తగలబెట్టిన కేసు ఒప్పుకోవాలని మైలవరం ఎస్సై రాంబాబు కొట్టినట్లు యువకుడు ఆరోపించాడు.
మైలవరంలో యువకుడు ఆత్మహత్యయత్నం
చావు బతుకుల్లో ఆసుపత్రిలో చేరితే ఏఎస్సై వచ్చి తెల్ల కాగితంపై సంతకం పెట్టించుకెళ్లారని..తమకు న్యాయం చేయాలంటూ బాధితుడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని శివ తల్లి రమణమ్మ వేడుకుంటున్నారు. ప్రస్తుతం శివ మైలవరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇదీ చదవండి: