ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణా జిల్లాలో యువకుడు దారుణ హత్య - latest murder case in nandhigama

కృష్ణా జిల్లా మునగచర్లలో ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. గత నాలుగు రోజులుగా తన కుమారుడు కనిపించకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనుమానితులను పోలీసులు ప్రశ్నించగా..హత్య వెలుగుచూసింది.

కృష్ణా జిల్లాలో యువకుడు దారుణ హత్య
కృష్ణా జిల్లాలో యువకుడు దారుణ హత్య

By

Published : Jun 20, 2020, 7:50 PM IST

Updated : Jun 20, 2020, 8:14 PM IST

కృష్ణా జిల్లా నందిగామ మండలం మునగచర్లలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన గంటా నవీన్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. నాలుగు రోజులుగా తన కుమారుడు కనిపించకపోవటంతో నవీన్ తల్లి నందిగామ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద పోస్టుల నేపథ్యంలోనే నవీన్ అదృశ్యమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో నందిగామ కాకతీయ స్కూల్ రోడ్డులో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు.

ఇదీ చూడండి:డీఎస్పీ కార్యాలయంలో యువతి ఆత్మహత్యాయత్నం

Last Updated : Jun 20, 2020, 8:14 PM IST

ABOUT THE AUTHOR

...view details