Induru young man and American woman marriage: తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాకు చెందిన అబ్బాయి, అమెరికా అమ్మాయి ఒక్కటయ్యారు. ఆర్మూర్ మండలం పెర్కిట్‌లోని ఓ కల్యాణ మండపంలో ఆర్మూర్ మండలం గోవింద్ పేట్‌కు చెందిన మూగ అభిషేక్, అమెరికాకు చెందిన అలెక్స్ వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం ఘనంగా జరిగింది.
ఎల్లలు దాటిన ప్రేమ.. అమెరికా అమ్మాయితో ఇందూరు అబ్బాయి వివాహం - love marriage
Induru young man and American woman marriage: ప్రేమించుకోవడానికి ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే సరిపోతుంది.. కులం, మతం, ప్రాంతం ఏవీ అడ్డురావు అని నిరూపించాడు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు. పై చదువుల కోసమని అమెరికాకు వెళ్లిన ఆయనకు.. అక్కడ ఓ అమ్మాయితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇరు కుటుంబాలను ఒప్పించి అబ్బాయి సొంత ఊరు ఇందూరులో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఆ జంట ఒక్కటైంది.
![ఎల్లలు దాటిన ప్రేమ.. అమెరికా అమ్మాయితో ఇందూరు అబ్బాయి వివాహం love marriage](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17572875-876-17572875-1674579657733.jpg)
అమెరికా అమ్మాయితో ఇందూరు అబ్బాయి వివాహం
అభిషేక్ గత కొన్నేళ్ల కింద అమెరికాలో చదువు కోసం వెళ్లారు. అక్కడ అలెక్స్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. పెళ్లికి అమెరికా నుంచి అలెక్స్ కుటుంబ సభ్యులు వచ్చి భారతీయ ఆచార సంప్రదాయాల ప్రకారం చీరకట్టులో మెరిశారు. అనంతరం బంధువులు, గ్రామస్థులతో ముచ్చటించారు. దీంతో గ్రామంలో స్థానికంగా సందడి నెలకొంది.
అమెరికా అమ్మాయితో ఇందూరు అబ్బాయి వివాహం
ఇవీ చదవండి: