ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 20, 2021, 8:31 PM IST

ETV Bharat / state

పామర్రులో దొంగనోట్ల చలామణి.. యువకుడు అరెస్టు

పామర్రులో దొంగనోట్లు చలామణి చేస్తూ యువకుడు పట్టుబడ్డాడు. అతన్ని అరెస్టు చేసిన పోలీసులు ఆ యువకుడికి గతంలో గంజాయి, క్రికెట్ బెట్టింగ్​ కేసులతో సంబంధాలు ఉన్నాయని తేల్చారు.

పామర్రులో దొంగనోట్లు చలామణి చేస్తున్న యువకుడు అరెస్టు
పామర్రులో దొంగనోట్లు చలామణి చేస్తున్న యువకుడు అరెస్టు

కృష్ణా జిల్లా పామర్రులో దొంగనోట్లు చలామణి చేస్తూ యువకుడు పట్టుబడ్డాడు. పామూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పేరం శశిధర్ అనే వ్యక్తి.. కొబ్బరిబొండం తాగి ఐదు వందల రూపాయలు నోటు ఇచ్చాడు. కొబ్బరిబొండాల వ్యాపారి సత్యనారాయణరెడ్డి అది దొంగనోటుగా గుర్తించి.. అడగగా శశిధర్ పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. స్థానికులు వెంబడించి అతన్ని పట్టుకున్నారు.

అతని వద్ద ఇంకా రూ.15,500 దొంగనోట్లను కూడా గుర్తించారు. దొంగనోట్లతో సహా అతన్ని పోలీసులకు అప్పజెప్పారు. కొబ్బరి బొండాల వ్యాపారి ఫిర్యాదుతో పామర్రు పోలీసులు నిందితుని వద్ద ఉన్న మిగిలిన చెల్లనినోట్లను సీజ్ చేసి అరెస్టు చేశారు. ఇతనికి గతంలో కూడా గంజాయి, క్రికెట్ బెట్టింగ్ కేసులతో సంబంధం ఉన్నట్టు విచారణలో తేలిందని పామర్రు సిఐ నబీ వెల్లడించారు.

ఇదీ చదవండి:

దిగ్గజ చమురు సంస్థల సీఈఓలతో మోదీ కీలక భేటీ

ABOUT THE AUTHOR

...view details