ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కథలపై మక్కువ... పిల్లలకు విలువలు నేర్పుతున్న స్నేహ - children

ఉమ్మడి కుటుంబాలకు స్వస్తి పలికి ఇరుకు జీవితాలు మొదలయ్యాక.... ఎవరి గొడవ వారిది. కనీసం ఇంట్లో ఉన్న నలుగురు సరదాగా మాట్లాడుకోవడం గగనంగా మారింది. చిన్నారులతో ర్యాంకుల గోలే తప్ప... మంచి, చెడు చెప్పే వారే కరువయ్యారు. ఒకప్పుడు అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు పక్కన కూర్చోపెట్టుకుని చిట్టి కథలతోనే జీవితంలో ఎలా ఉండాలో చెప్పేవారు. ఇప్పుడు ఆ బాధ్యతనే తీసుకుని... చిన్నారుల్లో భావోద్వేగాలను తట్టిలేపేందుకు ప్రయత్నిస్తోంది ఓ యువతి.

స్నేహ చిన్మయ్

By

Published : May 7, 2019, 8:03 AM IST

అనగనగా ఓ యువతి

కథ... కేవలం కాలక్షేపం కోసం చెప్పుకునేది కాదు. ఎన్నో భావాలు, మరెన్నో భావోద్వేగాలను ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే విధంగా చెప్పగలిగే శక్తి కథకి ఉంటుంది. అందుకే ఆ మార్గాన్ని ఎంచుకుంది విజయవాడకు చెందిన స్నేహ చిన్మయ్. బీటెక్ చేసి డిజిటల్ మీడియా కన్సల్టెంట్​గా విధులు నిర్వహిస్తోంది. అయినా కథలంటే మక్కువ. తన కథలతో చిన్నారులను ఆలోచింపజేయాలనే తపన. అందుకే స్టోరీ టెల్లింగ్ రంగంలో అడుగు పెట్టింది.

చిన్నారులు ఆలోచించేలా..
సమయం ఉన్నప్పుడూ చిన్న పిల్లలకు కథలు చెబుతోంది స్నేహ. యాంత్రిక జీవితంలో మర్చిపోయిన విలువల్ని పిల్లలకు నేర్పుతోంది. చిన్నారుల మనసును తాకే కథలు చెబుతూ వారిని ఆలోచింపజేస్తోంది. మన చుట్టూ ఉన్న వాటితో అప్పటికప్పుడు కథలు చెప్పేలా పిల్లలకు శిక్షణ ఇస్తే వాళ్ల మెదడు చురుక్కా పని చేస్తుందంటోంది. అలాగే పిల్లలు చెప్పే కథలను బట్టి వాళ్ల మానసిక స్థితి, ఆలోచనా విధానాలను సైతం అంచనా వేయవచ్చని ఈ రంగంలో కాలు పెట్టానని తెలిపింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details