ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మా గ్రామం పక్కన డంపింగ్ యార్డు వద్దు సార్'

అవనిగడ్డలోని చెత్తను.. శివారు ప్రాంతమైన ఎడ్లలంక గ్రామం పక్కన వేసేందుకు వచ్చిన టాక్టర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామం పక్కడ డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం మానుకోవాలని సూచించారు. అధికారులు స్పందించి తమ ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు.

By

Published : Jun 9, 2020, 3:02 PM IST

yedlalanka
yedlalanka

కృష్ణాజిల్లా అవనిగడ్డ శివారు ఎడ్లలంక గ్రామం పక్కన డంపింగ్ యార్డ్ కోసం తోటనరికి... అవనిగడ్డలోని చెత్తను తరలిస్తుంటే.. ఎడ్లలంక గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎడ్లలంక గ్రామం ఇప్పటి వరకు పచ్చదనం, పరిశుభ్రతతో ఉందన్నారు. పచ్చని పొలాల మధ్య వ్యవసాయ కూలీ పనులు ప్రశాంతంగా చేసుకుంటున్నామని.. చెత్తను తెచ్చి ఇక్కడ వేయడం మానుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అవనిగడ్డ మండల కేంద్రంలో 20 వేల జనాభా వినియోగించిన వ్యర్థాలను ఎడ్లలంక గ్రామం ప్రక్కన పోగుచేయడం గ్రామస్తుల ఆరోగ్యానికి, వ్యవసాయ పంటలకు, భూగర్భ జలాలకు, మత్స్య సంపదకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి నది గర్భంలో ఏర్పాటు చేయాలనుకున్న డంపింగ్ యార్డును వేరొక చోటికి తరలించి తమ ఆరోగ్యాన్ని కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details