కృష్ణాజిల్లా గన్నవరం నియోజవర్గ వైకాపా సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైకాపాలో చేరుతున్నట్లు సమాచారం రావడంతో... నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకున్నారు. కార్యకర్తలను చూసిన యార్లగడ్డ వెంకట్రావు ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వంశీని పార్టీలోకి తీసుకుంటున్నారంటూ ప్రసార మాధ్యమాల్లో రావటం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా అధినేత జగన్‌ను కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. గత ఎన్నికల్లో కుట్రలు, కుతంత్రాలతో తాను స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
'జగన్-వంశీ భేటీ గురించి నాకు సమాచారం లేదు' - వల్లభనేని తాజా వార్తలు
సీఎం జగన్‌ను వంశీ కలవడంపై వైకాపా నేత యార్లగడ్డ వెంకట్రావు స్పందించారు. గన్నవరంలో పార్టీ బలోపేతానికి రెండేళ్ల నుంచి పని చేస్తున్నానన్న ఆయన...సీఎం జగన్‌ను వంశీ కలవడంపై తనకెలాంటి సమాచారం లేదన్నారు. వంశీ పార్టీలో చేరడంపై సీఎంను కలిసిన తర్వాత స్పందిస్తానన్నారు.

ycp-yarllagadda-protest-in-vijayawada