ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మీ అంతు చూస్తా'... విద్యార్థి నాయకులకు వైకాపా ఎంపీ వార్నింగ్..! - ఏపీ రాజధాని అమరావతి వార్తలు

అమరావతి కోసం నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘాల నాయకుల పట్ల వైకాపా ఎంపీ నందిగం సురేశ్ దురుసుగా ప్రవర్తించారు. అమరావతి పోరుకు మద్దతు ఇవ్వాలని అడగ్గా... తమను బూతులు తిట్టారని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ycp MP nadigam suresh blames Amravati protesters
ycp MP nadigam suresh blames Amravati protesters

By

Published : Feb 2, 2020, 4:50 PM IST

అమరావతికి మద్దతు కోరినందుకు.... వైకాపా ఎంపీ తిట్ల దండకం

వైకాపా ఎంపీ నందిగం సురేశ్​​​​కు అమరావతి నిరసన సెగ తగిలింది. సొంత పనిపై కృష్ణా జిల్లా నందిగామకు వచ్చిన ఆయనకు... టీఎన్ఎస్ఎఫ్ నాయకులు గులాబీ పూలు ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. రాజధాని అమరావతికి మద్దతు ఇవ్వాలని ఆయనను కోరారు. ఎంపీ సురేశ్​​ మాత్రం తమను బూతులు తిడుతూ ముందుకు సాగారని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. ఒక ఎంపీ అయి ఉండి... అసభ్యకరరీతిలో దూషించడం ఏంటని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మీ అంతు చూస్తా' అని తమను హెచ్చరించారని వారు వాపోయారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details