కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి లేఖ రాశారు. కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం పెట్టుబడులను ఆకర్షిస్తుందని లేఖలో పేర్కొన్నారు. విదేశీ పెట్టుబడులు సైతం పెద్దఎత్తున వచ్చే అవకాశముందన్న బాలశౌరి... ప్రస్తుత ఆర్థికమాంద్యానికి ఈ పెట్టుబడులు ఔషధంలా పని చేస్తాయని అభిప్రాయపడ్డారు. ఆదాయపన్ను మినహాయింపు పరిమితి పెంపును పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ఆర్థికమంత్రికి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి లేఖ - ఎంపీ బౌలశౌరి
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి లేఖ రాశారు. ఆదాయపన్ను మినహాయింపు పరిమితి పెంపును పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్రమంత్రికి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి లేఖ