ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేసి తీరుతామని వైకాపా స్పష్టం చేసింది. పేదలకు మంచి చేసేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తుంటే చంద్రబాబు అడ్డుపడుతున్నారని.. న్యాయ స్థానాల్లో కేసులు వేస్తూ అడ్డుకుంటున్నారని వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ ఆరోపించారు. 30 లక్షల మంది మహిళ జీవితాల్లో చంద్రబాబు నిప్పులు పోశారని ధ్వజమెత్తారు.
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలన్నీ అవాస్తవం: జోగి రమేష్ - చంద్రబాబుపై జోగి రమేష్ విమర్శలు
తెదేపా అధినేత చంద్రబాబు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఇళ్ల స్థలాల పంపిణీ ఆగదని వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై చంద్రబాబు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలన్నారు. ఆధారాలుంటే చూపించాలని డిమాండ్ చేశారు. లోకేశ్ వార్డు మెంబర్ గా కూడా గెలవలేరని విమర్శించారు.
జోగి రమేష్
ఫోన్ ట్యాపింగ్ పై చంద్రబాబు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలన్నారు. ఆధారాలు ఉంటే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పినా..వాటిని చూపించలేకపోయారన్నారు. చంద్రబాబుకు సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత లేదని జోగి రమేష్ విమర్శించారు. లోకేశ్ వార్డు మెంబర్ గా కూడా గెలవలేరన్న జోగి రమేష్...లోకేశ్ మీద వాలంటీర్ ని పోటీ పెట్టి గెలిపిస్తామని...ఈ సవాల్ కు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :పశ్చిమలో పంటలను మింగేసిన వరద గోదావరి