రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోందని, భౌతిక దూరం పాటించండి.. మాస్కులు వేసుకోండి అంటూ వైద్యులు చెప్తుంటే... రాజకీయ నాయకులు మాత్రం ఇవేవి పట్టనట్లు ప్రవర్తిస్తున్నారు. కృష్ణాజిల్లా గన్నవరం మండలం తెంపల్లిలో స్థానిక ఎమ్మెల్యే వంశీ మోహన్ కృష్ణ మేళతాళాలతో మాస్కుకూడా లేకుండా పర్యటించటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
' కరోనా కమ్మేస్తుంటే వైకాపా నాయకుల హడావిడి... జాగ్రత్తలు పట్టవా' - taja news of valabhaneni vamsi
సమస్యల పరిష్కారంలో భాగంగా కృష్ణా జిల్లా గన్నవరం మండలం తెంపల్లిలో స్థానిక ఎమ్మెల్యే వంశీ మోహన్ పర్యటించారు. జిల్లాలో రోజురోజుకు చాపకింద నీరులా కరోనా కేసులు పెరుగుతున్నా... మేళ తళాలతో వైకాపా నేతలు చేసిన హడావుడిపై పలువురు నేతల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ycp mla valabhaneni vamsi visits gannavaram zone thempalli village without maintain social distance