Gapada gadapaki mana prabhuthvam: కృష్ణాజిల్లా పమిడిముక్కల గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే అనిల్ కుమార్‌కు ఎన్టీఆర్ కాలనీలో చేదు అనుభవం ఎదురైంది. పార్టీలో ఉన్న కార్యకర్తలకే న్యాయం జరగడం లేదని, ఇంకా ప్రజల సమస్యలు ఎం తీరుస్తారని ఎమ్మెల్యేని నిలదీశారు. అదేవిధంగా జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలు సగంలోనే ఆగిపోయాయని, రహదారులు లేక విద్యుత్ పనులు చేయకుండా వదిలేశారని ప్రజలు వాపోయారు. అప్పుచేసి కట్టుకున్న ఇళ్లని నీళ్లలోనే వదిలేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీకి వెళ్లటానికి రహదారి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. గృహ నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఆయన స్పందిస్తూ త్వరలోనే మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి మండలంలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సచివాలయం సిబ్బంది, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
గడప గడపకు ప్రభుత్వంలో.. ఆ ఎమ్మెల్యేకి అడుగడుగున ప్రశ్నలే.. - gapada gadapaki mana prabhuthvam
Gapada gadapaki mana prabhuthvam: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. సొంత కార్యకర్తల నుంచే నిరసన ఎదురవడంతో సర్ది చెప్పుకోలేక పక్కకు వెళ్లారు. పార్టీలో ఉన్న కార్యకర్తలకే న్యాయం జరగడంలేదని ఇంకా ప్రజల సమస్యలు ఎం పరిష్కరిస్తారని నిలదీశారు.
ycp mla