విజయవాడలో అగ్నిప్రమాదంపై జిల్లా కలెక్టర్‌తో మంత్రి పెద్దిరెడ్డి ఫోనులో మాట్లాడారు. బాధితులను ఆదుకునే చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. రక్షణ సదుపాయాలు ఉండేలా చూసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు. వైద్యారోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేశామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అగ్నిప్రమాదంపై నివేదిక సమర్పించాలని సీఎం అదేశించారని మంత్రి తెలిపారు. హోంమంత్రి సుచరిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. ప్రమాదంపై అన్ని ఆధారాలు సేకరించాలని అధికారులకు హోంమంత్రి ఆదేశించారు. కరోనా బాధితులు అగ్నిప్రమాదం బారిన పడటం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.
కొవిడ్ కేర్ సెంటర్లో అగ్నిప్రమాదంపై మంత్రుల దిగ్భ్రాంతి
విజయవాడ స్వర్ణప్యాలెస్లో జరిగిన అగ్నిప్రమాదంపై మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చర్యలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
home-minister-suchaitha-condolenct-to-victims-of-swarna-pales-fire-borken-in-vijayawada
Last Updated : Aug 9, 2020, 4:41 PM IST