కృష్ణా జిల్లా తిరువూరులో నిర్వహించిన వైఎస్సార్ రైతుభరోసా విజయోత్సవ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది.విజయోత్సవ ర్యాలీలో భాగంగా ఎద్దుల బండిపై ప్రయాణిస్తోన్న రక్షణ నిధికి తృటిలో ప్రమాదం తప్పింది.బ్యాండు మేళాలతో ఎద్దుల బండిపై చేరుకుని వెళ్తోన్న ఎమ్మెల్యే,సభా వేదికకు చేరుకునే సమయానికి ఎద్దులు బెదిరిపోయి,పరుగు తీశాయి.దీంతో బిత్తరపోయిన కార్యకర్తలు ఆందోళనకు గురైయ్యారు.అందరు కలసి ఎమ్మెల్యే రక్షణనిధిని సురక్షితంగా బండి పై నుంచి కిందకు దించేశారు.ఎద్దులను మల్లెల సహకార సంఘం అధ్యక్షుడు కలకొండ రవికుమార్ కట్టడి చేయడంతో ప్రమాదం తప్పింది.అక్కడి నుంచి ఎమ్మెల్యే పాదయాత్రగా సభా వేదికకు చేరుకున్నారు.
బెదిరిన ఎద్దులు..ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం - ycp leaders missed a risk in bullcart tiruvuru krishna district
కృష్ణాజిల్లా తిరువూరులో ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధికి ప్రమాదం తృటిలో తప్పింది. వైఎస్సార్ రైతు భరోసా విజయోత్సవ ర్యాలీలో భాగంగా ఎమ్మెల్యే ఎక్కిన ఎద్దుల బండి అదుపు తప్పింది. బ్యాండ్ మేళంతో బెదిరిపోయిన ఎద్దులు పరుగులు తీశాయి. దీంతో ఎమ్మెల్యేను కార్యకర్తలందరు సురక్షితంగా బండి నుంచి కిందకు దించారు.
తిరువూరులో బెదిరిన ఎద్దులు... నేతలు బెంబేలు
TAGGED:
ysr raithu bharosa