వైకాపా నేతల ఎన్నికల ప్రచారం కృష్ణాజిల్లా గన్నవరం మండలంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారం చేశారు. నియోజకవర్గంలోని చిన్న అవుటపల్లి, తెంపల్లి, బలిపర్రు, వీరపనేనిగూడెం గ్రామాల్లో తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగన్ రావాలని అభిప్రాయపడ్డారు. రోడ్ షోలో యార్లగడ్డ వెంకట్రావుతో పాటు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి