ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దేవినేని పర్యటనను అడ్డుకున్న వైకాపా నేతలు

టిడ్కో ఇళ్లను పరిశీలించేందుకు వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో వైకాపా నాయకులు వాగ్వాదానికి దిగారు. తమ గ్రామంలోకి రావటానికి వీలు లేదంటూ అడ్డగించటంతో.. దేవినేని రోడ్డు పైనే బైఠాయించి నిరసన తెలిపారు.

tdp leaders vs ycp leaders
దేవినేని పర్యటనను అడ్డుకున్న వైకాపా నేతలు

By

Published : Nov 3, 2020, 2:30 PM IST

విజయవాడ నగర శివారు జక్కంపూడిలో టిడ్కో గృహాలను పరిశీలించేందుకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్థానిక తెదేపా నాయకులతో వెళ్లారు. ఈ విషయాన్ని తెలుసుకున్న జక్కంపూడికి చెందిన వైకాపా నేతలు తెదేపా నాయకులతో వాగ్వాదానికి దిగారు. దేవినేని ఉమామహేశ్వరరావు తమ గ్రామానికి రావటానికి వీలు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో దేవినేని ఉమామహేశ్వరరావు రోడ్డుపైనే బైఠాయించి నిరసనకు దిగారు. తమ గ్రామంలోకి రావొద్దంటూ వైకాపా అక్కడ నుంచి వెనుదిరిగారు. గ్రామంలో భారీగా మట్టి మాఫియా జరుగుతుందనీ.. దాన్ని ప్రశ్నించేందుకు వచ్చిన తమను స్థానిక వైకాపా నేతలు అడ్డుకుంటున్నారని దేవినేని ఉమా మండిపడ్డారు. పులివెందుల ఫ్యాక్షన్ రాజకీయాలు నగరం నడిబొడ్డున చేస్తే సహించమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కే ప్రయత్నం చేయలేదనీ.. ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పనితీరునుపై నిరసన తెలిపే హక్కు ఉందన్నారు. దాన్ని హరించే విధంగా ఇప్పటి ప్రభుత్వం చేస్తున్న పాలన ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. ఇదే విధంగా కొనసాగితే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు నాంది పలుకుతుందనీ.. ఇప్పటికైనా ప్రతిపక్షాల గొంతు నొక్కకుండా ప్రజలకు మంచి చేసే విధంగా పాలన సాగించాలని దేవినేని ఉమా హితువు పలికారు.

ABOUT THE AUTHOR

...view details