ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'భాజపా కార్యకర్తపై దాడికి పాల్పడిన వారిని శిక్షించాలి' - YCP leaders attack BJP activist in Kondrapadu Krishna District

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తెదేపా ఓట్లు...భాజపాకు పడ్డాయనే కక్షతోనే తమ కార్యకర్తపై దాడికి పాల్పడినట్లు భాజపా కార్యకర్తలు ఆరోపించారు. ఘటనకు పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ నందిగామ డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశామన్నారు.

'భాజపా కార్యకర్తపై దాడికి పాల్పడిన వారిని శిక్షించాలి'
'భాజపా కార్యకర్తపై దాడికి పాల్పడిన వారిని శిక్షించాలి'

By

Published : Apr 11, 2021, 10:24 PM IST

కృష్ణా జిల్లా చందర్లపాడు మండలంలో భాజపా కార్యకర్తపై వైకాపా నేతలు దాడి చేశారని నందిగామ డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. కాండ్రపాడులో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తెదేపా ఓట్లు.. భాజపాకు పడుతున్నాయని వైకాపా నేతలు కక్ష పెట్టుకున్నారని ఆరోపించారు. దీంతో వైకాపాకి మెజారిటీ తగ్గుతుందని, భాజపాకి చెందిన ఏజెంట్ వెంకటప్పరెడ్డిపై దాడికి యత్నించరన్నారు. ఘటనపై చందర్లపాడు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశామన్నారు. ఈ సమస్య పరిష్కారం కాకముందే.. తిరిగి దాడి చేయడంతో నందిగామ డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశామన్నారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details