ఉపయోగించేందుకు సిద్ధంగా ఉన్న 50 ఆక్సిజన్ క్యాన్లను వైకాపా నేత సయ్యద్ అలీమ్ కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌కు అందజేశారు. వీటిని నగరంలోని కొవిడ్ సెంటర్లకు పంపుతామని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరు ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు 250 ఆక్సిజన్ క్యాన్లు పంపిణీ చేశామని అలీమ్ అన్నారు. అత్యవసరమైన వారు తమను సంప్రదించవచ్చని తెలిపారు.
కలెక్టర్‌కు ఆక్సిజన్ క్యాన్లు అందజేత - కలెక్టరి ఇంతియాజ్ వార్తలు
కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌కు వైకాపా నేత సయ్యద్ అలీమ్ 50 ఆక్సిజన్ క్యాన్లను అందజేశారు. వీటిని వెంటనే నగరంలోని కొవిడ్ సెంటర్లకు పంపుతామని కలెక్టర్ తెలిపారు. అలీమ్ ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నారు. అత్యవసరమైన వారు తమను సంప్రదించవచ్చని అలీమ్ తెలిపారు.
ఆక్సిజన్ క్యాన్లు