విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల ఓటర్ల జాబితాలో జరిగిన తప్పులపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు వైకాపా నేత పిల్లి వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. నగరంలో డివిజన్ల సంఖ్య పెరుగుదలతో తమ డివిజన్లో ఉండాల్సిన ఓట్లు లేకుండాపోయాయని, ఇలా ప్రతి డివిజన్లో వందల సంఖ్యలో ఓట్లు వేరే డివిజన్లలో నమోదు కావడంతో గందరగోళం నెలకొందని ఆయన అన్నారు. ఈ అంశంపై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ... జాబితాను సరిచేయలేదని వెంకటేశ్వరరెడ్డి ఆక్షేపించారు.
ఓటర్ల జాబితాలో తప్పులపై ఎస్ఈసీకి ఫిర్యాదు - krishna district latest news
విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల జాబితాలో తప్పులు జరిగాయని వైకాపా నేత పిల్లి వెంకటేశ్వరరెడ్డి అన్నారు. ఈ అంశంపై ఓటర్ల జాబితాను సవరించాలని అధికారులను కోరినప్పటికీ, సరైన స్పందన లేదని తెలిపారు. ఫలితంగా ఎస్ఈసీ కి ఫిర్యాదు చేసినట్లు వెంకటేశ్వరరెడ్డి వెల్లడించారు.
వైకాపా నేత పిల్లి వెంకటేశ్వరరెడ్డి