వైకాపా నేత దేవినేని అవినాష్.. సొంత ఖర్చుతో సోడియం క్లోరైడ్ స్ప్రే వాహనాన్ని ఏర్పాటు చేశారు. పటమటలో పలు ప్రాంతాల్లో స్వయంగా పిచికారీ చేయించారు. కరోనా వ్యాప్తి చెందకుండా.. సీఎం జగన్ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని అవినాష్ తెలిపారు. దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్టు ద్వారా రోజుకు మూడు వేల మందికి భోజనం అందిస్తున్నామని చెప్పారు. విపత్కర సమయంలోనూ ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేయడం సరికాదన్నారు.
పటమటలో సోడియం క్లోరైడ్ ద్రావణం పిచికారీ - latest updates of covid 19 cases
ప్రజా సమస్యలను పరిష్కరించడమే అజెండాగా వైకాపా ప్రభుత్వం పని చేస్తోందని దేవినేని అవినాష్ అన్నారు. పటమటలోని పలు ప్రాంతాల్లో సొడియం క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.
ycp-leader-devineni-avinash