Jayaho BC Sabha: మూడున్నరేళ్ల పాలనలో బీసీల కోసం ఏం చేశారో.. రాబోయే రోజుల్లో ఏం చేస్తామో ఈనెల 7న జరిగే 'జయహో బీసీ' సభలో సీఎం జగన్ ప్రకటిస్తారని వైకాపా నేతలు తెలిపారు. విజయవాడలో జరిగే బీసీ మహాసభ ఏర్పాట్లను వైకాపా నేతలు పరిశీలించారు. జయహో బీసీ మహాసభ పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రభుత్వం, పార్టీలో పదవులు పొందిన 84 వేల మంది బీసీ నేతలందరినీ సమావేశానికి ఆహ్వానించినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. వెనుకబడిన వర్గాలకు భరోసా ఇవ్వడమే ఈ సభ ఉద్దేశమని మంత్రులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి, పలువురు బీసీ మంత్రులు పాల్గొన్నారు.
బీసీ మహాసభ ఏర్పాట్లను పరిశీలించిన వైకాపా నేతలు - విజయవాడలో వైసీపీ జయహో బీసీ మహాసభ
Jayaho BC Sabha: ఈనెల 7వ తేదీన విజయవాడలో ''ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం'' లో వైసీపీ జయహో బీసీ మహాసభ నిర్వహించనుంది. దీనికి సంబంధించ ఏర్పాట్లు పర్యవేక్షించిన వైకాపా నేతలు పరిశీలించారు. సభా ప్రాంగణం వద్ద 'జయహో బీసీ' మహాసభకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డితో పలువురు మంత్రులు పాల్గొన్నారు.
BC meeting