కార్పొరేషన్ల ఏర్పాటు పేరుతో బీసీలను సీఎం జగన్ నయవంచన చేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు దుయ్యబట్టారు. కనిపించని రాజ్యానికి రాజుల్లా నిధుల్లేని కార్పొరేషన్లకు ఛైర్మన్లను ఏర్పాటు చేశారని ఆయన మండిపడ్డారు. తెదేపా హయాంలోనే కార్పొరేషన్ల ద్వారా బడుగుల పురోభివృద్ధికి బాటల వేశామని కళా వెల్లడించారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇళ్ల స్థలాల పేరుతో బీసీల నుంచి 4వేల ఎకరాలు లాక్కుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్పొరేషన్ల నుంచి బీసీలకు అందాల్సిన నిధుల్ని పక్కదారి పట్టించారని ఆరోపించారు.
కార్పొరేషన్ల ఏర్పాటు పేరుతో బీసీలను నయవంచన : కళా వెంకట్రావు - bc corporations latest newsd
రాష్ట్రంలో 56 బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై స్పందించిన తెదేపా... రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది. బీసీలకు 139 కార్పొరేషన్లు అని ప్రకటించి ఇప్పుడు 56 అంటున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు.
kala venkata rao
16 నెలల పాలనలో బీసీల కోసం ఒక్క కొత్త పథకమైనా ప్రారంభించారా అని కళా నిలదీశారు. కార్పొరేషన్ నిధులను మళ్లించడంపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలకు 139 కార్పొరేషన్లు అని ప్రకటించి ఇప్పుడు 56 అంటున్నారని మండిపడ్డారు. కొంత మందికి ప్రయోజనం చేకూర్చడం కోసం కార్పొరేషన్లను నిర్వీర్యం చేసి కోట్లాది బీసీల పొట్ట కొడుతున్నారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.