ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రాన్ని నేరాలకు నిలయంగా మార్చేశారు: పంచుమర్తి అనురాధ - panchumarthi anuradha comments on ycp

వైకాపా పాలనపై తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏడాదిన్నరలో రాష్ట్రాన్ని నేరాలకు నిలయంగా మార్చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరిగిన హత్యలు, ఆత్మహత్యలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

panchumarthi anuradha
panchumarthi anuradha

By

Published : Nov 19, 2020, 3:31 PM IST

వైకాపా ఏడాదిన్నర పాలనలో రాష్ట్రాన్ని హత్యలు, ఆత్మహత్యలు, హత్యాయత్నాలకు నిలయంగా మార్చారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేయటంతో వివిధ వర్గాల వారు ప్రభుత్వ తీరుతో విసిగిపోయారని ఆమె అన్నారు. రాష్ట్రంలో జరిగిన హత్యలు, ఆత్మహత్యలపై సీబీఐ విచారణ జరిపించటంతోపాటు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

విలువలన్నీ వదిలేసి 5ఏళ్లు కాలం గడిపేద్దామన్న రీతిలో సీఎం జగన్ ప్రవర్తన ఉందని అనురాధ విమర్శించారు. 18నెలల పాలనలో దోపిడీ వర్గం తప్ప ప్రజలెవరూ సంతోషంగా లేరని ఆమె వ్యాఖ్యానించారు. మానవత్వం మరిచి ధనమే ధ్యేయం అన్నట్లు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిహారే నయం అనిపించేంత రాక్షసత్వంగా రాష్ట్ర ప్రభుత్వ పాలన ఉందని ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details