ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోంది: దేవినేని

వైకాపా ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందని.. మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. కరోనా, కరోనా బాధితుల విషయంలో తప్పుడు లెక్కలు చెబుతోందని ధ్వజమెత్తారు. అధికారం ఉంది కదా అని తప్పుడు కేసులు పెడితే... భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

మాజీమంత్రి దేవినేని ఉమా
మాజీమంత్రి దేవినేని ఉమా

By

Published : Jun 24, 2021, 10:52 PM IST

జగన్​పై కేసు వేసిన ఎర్రన్నాయుడు, అశోక్ గజపతిరాజు కుటుంబాలపై కక్షతో... తప్పుడు కేసులు పెట్టి వేధించారని మాజీమంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. అశోక్​ గజపతిరాజు రాజు కుటుంబం లక్షల కోట్ల ఆస్తులు దానం చేసిందని, అలాంటి వారిని జైల్లో పెడతామని మాట్లాడటం ఎంతవరకు సమంజసమని వ్యాఖ్యానించారు. అశోక్​ గజపతిరాజు స్థాయికి విజయసాయి రెడ్డి సరిపోతారా..? అని ప్రశ్నించారు. పాదయాత్రలో పెద్దపెద్ద మాటలు చెప్పిన జగన్... సుబాబుల్​ రైతులు నష్టపోతుంటే ఏం చేశారని నిలదీశారు. వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కొవిడ్ పరిస్థితులు తగ్గిన తరువాత సుబాబుల్ రైతుల పక్షాన పోరాటం చేస్తామని ఉమా ప్రకటించారు.

ప్రజాప్రతినిధుల బంధువులు సిండికేట్​గా ఏర్పడి రైతుల గొంతు కోశారని ఆరోపించారు. 3 వేల కోట్లు ధరల స్థిరీకరణ నిధి ఎవరికి ఇచ్చారని ప్రశ్నించారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి.. ఇంకా రూ.4 వేల కోట్లు ఇవ్వాలని పేర్కొన్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం ఇబ్బంది కలిగిస్తున్నా... ఆ సంఘాల నేతలు ఎక్కడికి పోయారని నిలదీశారు. పులివెందుల పట్టణానికి రూ.600 కోట్లు కేటాయించారని, దీన్నిబట్టి బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉన్నాయో అర్థమవుతుందన్నారు. కేసులు మాఫీ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details