ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రలోభాలకు లొంగకుంటే హత్యకేసులు అంటగడతారా?' - కొల్లు రవీంద్రపై హత్య కేసు వార్తలు

తెదేపా బీసీ నేతలపై వైకాపా సర్కారు అక్రమ కేసులు బనాయిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై హత్య కేసును అక్రమంగా బనాయిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ చర్యలపై పోరాడతామని స్పష్టం చేశారు.

chandra babu
chandra babu

By

Published : Jul 3, 2020, 6:02 PM IST

తెలుగుదేశంలోని బీసీ నేతలను లక్ష్యంగా చేసుకుని వైకాపా ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఇప్పటికే బీసీ నేతలపై ఏసీబీ కేసులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, నిర్భయ కేసులు పెట్టిన సర్కారు.. ఇప్పుడు హత్యానేరం కేసులు మోపుతుందని మండిపడ్డారు.

అచ్చెన్నాయుడిపై తప్పుడు కేసు, యనమలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు, అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసులు పెట్టారు. బీద రవిచంద్రపై శాసనమండలిలోనే వైకాపా మంత్రులు దాడి చేశారు. ఇప్పుడు మరో బీసీ నేత కొల్లు రవీంద్రపై హత్య కేసు బనాయిస్తారా?.. ఏమిటీ ఉన్మాదం?.. మీ ప్రలోభాలకు లొంగకపొతే, మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే తెలుగుదేశం నేతలపై ఇంతకు తెగిస్తారా?. మీకు అలవాటైన హత్యా రాజకీయాలను వారికి అంటగడతారా?. వారిపై పెడుతున్న అక్రమ కేసులకు వ్యతిరేకంగా ప్రభుత్వంపై అన్నివిధాలా పోరాడుతాం. ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు- ట్విట్టర్​లో చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details