కోడెల శివ ప్రసాద్ రావు వైద్యరంగం, రాజకీయాల్లో తనదంటూ ప్రత్యేక ముద్ర వేసుకుని ప్రజల మన్ననలు పొందారని... కోడెల మరణం వ్యక్తిగతంగా తన మనసును కలిచివేసిందని శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుతూ, కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభుతి తెలిపారు. కోడెల మృతి పట్ల జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దిగ్భ్రాంతి చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు అనిల్ తెలిపారు.
'కోడెల కుటుంబ సభ్యులకు వైకాపా నేతల సంతాపం' - kodela family
మాజీ స్పీకర్ కోడెల ఆకస్మిక మృతి పట్ల వైకాపా సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జలవనరుల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
కోడేల శివప్రసాద్