ప్రజలతో నాడు- ప్రజల కోసం నేడు పేరిట ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో పాదయాత్ర చేపట్టారు. ప్రజా సంకల్పయాత్ర మూడేళ్లు పూర్తిచేసుకుందని తెలిపారు. పట్టణంలోని 18, 20, 21వ వార్డులో అధికారులతో కలిసి పర్యటించారు.
ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా ముందుకు సాగుతోందని సామినేని స్పష్టం చేశారు. పేద, మధ్యతరగతి వర్గాల వారికి మేలు చేసేలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు.