కృష్ణా జిల్లా గన్నవరం వైకాపాలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే వంశీకి వ్యతిరేకంగా వైకాపా కార్యకర్తలు ధర్నా చేపట్టారు. బాపులపాడు మండల పరిషత్తు కార్యాలయం వద్ద వైకాపా కార్యకర్తల ఆత్మగౌరవ దీక్ష పేరుతో ఆందోళన చేశారు. బీసీ, ఎస్సీలను వంశీ వేధిస్తున్నారని ఆరోపించారు. తమపై కక్షసాధింపులు ఆపాలని... వైకాపా శ్రేణుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. కాకులపాడు గ్రామస్థులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే వంశీకి వ్యతిరేకంగా వైకాపా శ్రేణుల ధర్నా - krishna district news
ఎమ్మెల్యే వల్లభనేని వంశీకు వ్యతిరేకంగా వైకాపా శ్రేణులు ఆందోళనబాటపట్టాయి. కొంతమంది కార్యకర్తలు బాపులపాడు మండల పరిషత్తు కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు.
ఎమ్మెల్యే వల్లభనేని వంశీకు వ్యతిరేకంగా నినాదాలు