Gannavaram YCP Leader Yarlagadda Venkatarao: వైసీపీని వీడుతున్నట్లు గన్నవరం నేత యార్లగడ్డ వెంకట్రావు ప్రకటించారు. టీడీపీలో చేరేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు అపాయింట్ కోరుతున్నానని చెప్పారు. విజయవాడలో తన అనుచరులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. గన్నవరం అభ్యర్థిగా తాను పనికొస్తానని భావిస్తే... టీడీపీ తరఫున టికెట్ ఇవ్వాలని కోరారు.
Anam's comments on Jagan: దుర్మార్గపు పాలన అంతానికి అందరూ సిద్ధం కావాలి: ఎమ్మెల్యే ఆనం
వైసీపీ నేత, గన్నవరం నియోజకవర్గం నాయకుడు యార్లగడ్డ వెంకట్రావు వైసీపీని వీడుతున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. విజయవాడలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన.. టీడీపీలో చేరేందుకు చంద్రబాబు నాయుడును అపాయింట్‌మెంట్ (Appointment ) కోరుతున్నానని స్పష్టం చేశారు. టీడీపీ తరఫున గన్నవరం అభ్యర్థిగా పనికొస్తానని భావిస్తే టిక్కెట్ ఇవ్వాలని కూడా కోరుతున్నానని చెప్పారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ.. తాను టీడీపీ నేతలను కలిసినట్లు వైసీపీ నాయకులు చెప్పడం సరికాదని తీవ్రంగా ఖండించారు. ఈ మూడున్నరేళ్లలో చంద్రబాబు, లోకేశ్‌ను మాత్రమే కాదు.. టీడీపీకి చెందిన ఏ ఒక్క నాయకుడిని కూడా తాను కలవలేదని యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. ఇది ముమ్మాటికీ పార్టీ ఇంటెలిజెన్స్ వైఫల్యమేనని నమ్మాల్సి వస్తోందన్న ఆయన.. తాను ఎవరినైనా కలిసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని అన్నారు. కలవకపోయినా కలిసినట్లు అవమానిస్తున్నారంటే ఏమనాలని ప్రశ్నించారు.
Balineni met CM Jagan: పార్టీలో ఇబ్బందులపై సీఎంతో చర్చించా: మాజీ మంత్రి బాలినేని
మన ఓటమే మన సమస్యలకు కారణం అని చెప్తూ.. గెలిస్తే అన్నీ సమస్యలు తీరుతాయనిఅన్నారు. పదవి పోయిన తర్వాత పది మంది కూడా వెంట ఉండరు.. నా వెంటే ఉండి నన్ను నమ్ముకుని చాలామంది ఉన్నారు అని పేర్కొన్నారు. వైసీపీలో చేరినప్పటి నుంచి అన్ని సేవలు చేశానని చెప్పారు. అయినా, నాకు జరిగిన అవమానాలు మీకందరికీ తెలుసు అని కార్యకర్తలను ఉద్దేశించి పేర్కొన్నారు. గన్నవరంలో వైసీపీ టికెట్ ( Gannavaram YCP Ticket ) వచ్చినప్పటి నుంచి గెలుపే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నానని అన్నారు.
రాజకీయాల్లో ఉండేటప్పుడు మన బాధలు ప్రజలకు చెప్పకూడదన్న వెంకట్రావు.. ప్రజా సమస్యలు విని పరిష్కరించగలిగితేనే నాయకుడు అవుతారని అన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి పార్టీ కోసం పనిచేశా.. కానీ, ఇవాళ ఉంటే ఉండు.. లేకపోతే వెళ్లు.. అని అంటున్నారని తెలిసి నాకు చాలా ఆవేదన కలిగింది అని అన్నారు. ఓడిపోయినప్పుడు కూడా నేను బాధపడలేదు.. 'పోతే పో' అనే దుస్థితి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు అని వాపోయారు. ఇప్పుడు నా బలం ఎందుకు బలహీనమయిందో పార్టీ పెద్దలే చెప్పాలని దుయ్యబట్టారు. నమ్మిన మనుషులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఏ పార్టీకైనా, నాయకుడికైనా ఉంటుదన్న యార్లగడ్డ.. కార్యకర్తలందరిని సంప్రదించా... ఏ నిర్ణయం తీసుకున్నా సరే అన్నారని తెలిపారు.
BJP 9 Questions to YSRCP: నాలుగేళ్ల వైసీపీ పాలనపై బీజేపీ 9 ప్రశ్నలు.. సమాధానాలు చెప్పాలని డిమాండ్