వృద్ధ కళాకారుల పింఛన్ల సమస్యను సీఎం జగన్ దృష్టికి వచ్చిన గంటల వ్యవధిలోనే నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయించడంపై... రాష్ట్ర అధికారభాషా సంఘం అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. గత ఏడు నెలలుగా వృద్ధ కళాకారులకు పింఛను విడుదల చేయకపోవడంవల్ల... వారు పడుతున్న కష్టాలను జూన్ 29న సీఎం దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. స్పందించిన ముఖ్యమంత్రి మరుసటి రోజే జీఓ విడుదల చేయించారని తెలిపారు. ఆరు నెలలకిగానూ 8 కోట్ల 43 లక్షల 66 వేల రూపాయలను విడుదల చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
వృద్ధ కళాకారుల పింఛన్ల సమస్యను పరిష్కరించడంపై హర్షం - Yarlagadda Lakshmiprasad news
వృద్ధ కళాకారుల పింఛన్ల విషయంలో సీఎం జగన్ స్పందించిన తీరుపై రాష్ట్ర అధికారభాషా సంఘం అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. సమస్యను గురించి చెప్పిన మరుసటి రోజే జీవో జారీ చేయడంపై.. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
వృద్ధ కళాకారుల పింఛన్ల సమస్యను పరిష్కరించడంపై హర్షం