మానవ హక్కుల ఛైర్మన్, సభ్యుల ఎంపిక సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. రాష్ట్రంలో ఏ వ్యక్తి హక్కులకైనా రక్షణ ఉందా అని ఆయన ప్రశ్నించారు. హక్కులకు గౌరవం లేని ఏకైక రాష్ట్రం ఏపీనేనన్నారు. వ్యక్తి హక్కుల రక్షణే ధ్యేయంగా పనిచేసే మానవ హక్కుల కమిషన్ ఏర్పాటులో.. ప్రభుత్వం ఉదాసీనత చూపుతోందన్నారు.
'గొంతు నొక్కేవారే.. పౌర హక్కులంటూ సమావేశమవటం హస్యాస్పదం' - వైకాపాపై శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు తాజా వ్యాఖ్యలు
శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మానవ హక్కుల ఛైర్మన్, సభ్యుల ఎంపిక సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ తప్పిదాల్ని ఎత్తి చూపితే తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అమరావతి మహిళలపై పోలీసులతో దాడులు చేయించారని గుర్తుచేశారు. నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తూ ఏర్పాటు చేసిన ఆ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామన్నారు.
శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు
జగన్ రెడ్డి పాలనంతా అరాచకాలు, విధ్వంసాలతో ప్రజా హక్కుల ఉల్లంఘనపై నడుస్తోందని ఆరోపించారు. అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కారని, దాడులు, దౌర్జన్యాలతో నెత్తుటి పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. ఓటు హక్కు కూడా వినియోగించు కోలేని పరిస్థితులు సృష్టించిన వారు.. పౌర హక్కులంటూ సమావేశం ఏర్పాటు చేయడం హాస్యాస్పదమని యనమల రామకృష్ణుడు ఎద్దేవాచేశారు.
ఇవీ చూడండి...:ఇంటర్ వృత్తి విద్యా కళాశాలల అనుమతుల్లో అక్రమాలు