పీపీఏల రద్దుతో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠ అంతర్జాతీయంగా దెబ్బతిందని తెదేపా నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. తన స్వార్థం, అవివేకంతో రాష్ట్రానికి సీఎం జగన్ కీడు చేస్తున్నారని ఆరోపించారు. రూ.40 వేల కోట్ల పెట్టుబడులను ప్రమాదంలోకి నెట్టారని దుయ్యబట్టారు. జపాన్, అబుదాబి, కెనడా, అమెరికా, సింగపూర్‌లో ఏపీపై విశ్వాసాన్ని దెబ్బతీశారు యనమల ధ్వజమెత్తారు. ఎవరూ పెట్టుబడులు పెట్టేందుకు రాకుండా చేశారని ఆరోపించారు.
'ఏపీ ప్రతిష్ఠ అంతర్జాతీయంగా దెబ్బతీస్తున్నారు' - పీపీఏలపై యనమల రామకృష్ణుడు
వైకాపా ప్రభుత్వం పీపీఏల రద్దు చేసి రాష్ట్ర ప్రతిష్ఠను అంతర్జాతీయంగా దెబ్బతీసిందని తెదేపా నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఎవరూ పెట్టుబడులు పెట్టేందుకు రాకుండా చేశారని ఆరోపించారు.
!['ఏపీ ప్రతిష్ఠ అంతర్జాతీయంగా దెబ్బతీస్తున్నారు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5130956-754-5130956-1574319076282.jpg)
వైకాపాపై యనమల రామకృష్ణుడు