ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పత్రికా స్వేచ్ఛకు విరుద్ధంగా కొత్త జీవో: యనమల - జగన్​పై యనమల వ్యాఖ్యలు

సీఎం జగన్​ ఫోర్త్​ ఎస్టేట్​ (మీడియా)ను నేలకూలుస్తున్నారని... తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. మీడియా సంస్థలను భయపెట్టేందుకే కొత్త జీవో తీసుకొచ్చారని ఆరోపించారు.

వైకాపా ప్రభుత్వంపై యనమల రామకృష్ణుడు

By

Published : Oct 31, 2019, 6:36 PM IST

ప్రజాస్వామ్యంలోని మూలస్తంభాలను సీఎం జగన్‌ కూల్చేస్తున్నారని... మండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. జగన్‌ నిర్ణయాలతో ఫోర్త్‌ ఎస్టేట్‌ నేలకూలుతోందన్నారు. రాజ్యాంగ ఆదర్శాలను సీఎం జగన్ కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. మీడియా సంస్థలను భయపెట్టేందుకే కొత్త జీవో తీసుకొచ్చారని ఆరోపించారు. పరువు నష్టం కేసులు బనాయించడమే దాని ఉద్దేశమన్నారు. పత్రికా స్వేచ్ఛపై సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా... కొత్త జీవో ఉందని అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details