ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధికారమే పరమావధిగా..వైకాపా తత్వం: యనమల - yanamala comments on ysrcp news updates

వ్యవస్థలను, వాటి ప్రతిష్టను దిగజార్చినా.. నిర్వీర్యం చేసినా.. ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలుతుందని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు హెచ్చరించారు. అధికారమే పరమావధి అనే వైకాపాతత్వం తీవ్రరూపం దాల్చిందని ఆయన దుయ్యబట్టారు.

yanamala
yanamala

By

Published : Jun 29, 2020, 3:35 PM IST

ఆంధ్రప్రదేశ్​లో ప్రజాస్వామ్యాన్ని వైకాపా ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని మాజీ మంత్రి తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. రాష్ట్రం, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు కానీ.. అధికారమే పరమావధి అనే వైకాపా తత్వం తీవ్రరూపం దాల్చిందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యం వ్యక్తుల ఇష్టాయిష్టాల పై ఆధారపడి నడవదన్న విషయం గుర్తుపెట్టుకోవాలని ఆయన హితవు పలికారు. వ్యవస్థలను, వాటి ప్రతిష్టను దిగజార్చినా.. నిర్వీర్యం చేసినా ..ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలుతుందని ఆక్షేపించారు. ప్రజాస్వామ్యం శిథిలావస్థకు చేరుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాల్లో ఎగువ సభ తప్పనిసరని అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details