ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 2, 2020, 10:22 PM IST

ETV Bharat / state

కొబ్బరితో 170 రకాల ఉత్పత్తులకు వీలు..

పోషకాలతో కూడిన ఆహారం, పానీయం అందిచడంతోపాటు ఆరోగ్యాన్ని కలిగిస్తున్న కొబ్బరికాయ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఏటా సెప్టెంబరు రెండో తేదీన ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా మైలవరం మండలం వెల్లటూరులో ఉద్యానశాఖ, అఖిల భారత కిసాన్‌ సంఘ్‌ సంయుక్త ఆధ్వర్యంలో కొబ్బరి దినోత్సవం జరిపారు.

world coconut day celebrations in krishna district
world coconut day celebrations in krishna district

వెల్లటూరులోని ఉద్యాన నర్సరీలో కొబ్బరి చెట్టుకు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. కొబ్బరి నుంచి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం అందితే కొబ్బరిలో కేరళ, తమిళనాడు కర్నాటక మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ పంట అభివృద్ధితోపాటు పారిశ్రామికంగానూ పురోభివృద్ధి సాధ్యమవుతుందని రైతులు తెలిపారు. వర్జీన్‌ ఆయిల్‌ తయారీ, కొబ్బరి పాలు, కొబ్బరి నూనె, ఎండు కొబ్బరి తయారీ పరిశ్రమల దిశగా ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరారు.

కొబ్బరి చెట్టులో కాండం నుంచి ఆకుల వరకు అన్ని పనికొచ్చేవేనని.. ఒకసారి నాటితే రకం మేరకు 50 నుంచి 70 ఏళ్ల వరకు దిగుబడి ఇస్తుందని... కొబ్బరితో 170 రకాల ఉత్పత్తులకు వీలుందని ఉద్యానశాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యానశాఖ సహాయ సంచాలకులు బి.దయాకర్‌బాబు, అఖిల భారత కిసాన్‌ సంఘ్‌ జాతీయ కార్యవర్గ సభ్యుడు జలగం కుమారస్వామి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఇదీ చదవండి:పలు తహసీల్దార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అనిశా సోదాలు

ABOUT THE AUTHOR

...view details