ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"బాల్య విహహాలు అరికట్టేందుకు అందరూ కృషి చేయాలి" - బాల్య విహహలు ఆరికట్టాలి-వాసిరెడ్డి పద్మ

బాల్య వివాహాలను అరికట్టాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అభిప్రాయపడ్డారు. ఆడపిల్లలు కుటుంబానికి బరువు కాదు అనే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. అందుకోసం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

"బాల్య విహహలు ఆరికట్టేందుకు అందరూ కృషి చేయాలి"

By

Published : Sep 24, 2019, 6:58 PM IST

"బాల్య విహహాలు అరికట్టేందుకు అందరూ కృషి చేయాలి"
రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై విజయవాడలోని ఓ హోటల్​లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా కమిషన్ ఛైర్​పర్సన్ వాసిరెడ్డి పద్మ హాజరయ్యారు. తాజాగా యూనిసెఫ్ విడుదల చేసిన బాల్య వివాహాల్లో దేశం ప్రథమ స్థానంలో ఉందని... ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరమని అన్నారు. సరైన అవగాహన కల్పిస్తే బాల్యవివాహాలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం అన్ని వర్గాల నాయకులు చొరవ చూపాలని సూచించారు. వెనకబాటుతనం, నిరక్షరాస్యత, పేదరికం వల్లే బాలికల తల్లిదండ్రులు బాల్య వివాహాల వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. ఆడపిల్లలు కుటుంబానికి బరువు కాదే అనే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details