ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుక కొరతను తీర్చాలంటూ... కార్మికుల ఆందోళన - latest news of sand problems in AP

ఇసుక కొరతను తీర్చాలంటూ  నందిగామ తహశీల్దారు కార్యాలయం ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు.  ఉపాధి లేక నష్టపోయిన ప్రతి ఒక్క కార్మికుడికి నెలకు 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు

workers-protest-at-nandigam-mro-office-over-sand-problem-in-state

By

Published : Oct 28, 2019, 4:27 PM IST

ఇసుక కొరతను తీర్చాలంటూ కార్మికుల ఆందోళన
ఇసుక కొరతను తీర్చాలని కోరుతూ కృష్ణాజిల్లాలోని నందిగామ తహశీల్దారు కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇసుక కొరత వల్ల గత మూడు నెలలుగా తమకు పనులు లేకుండా పోయాయని కార్మికులు ఆందోళనకు దిగారు. రోజువారీ జీవనం కష్టతరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడికి నెలకు 10 వేల చొప్పున పరిహారం అందజేయాలని డిమాండ్‌ చేశారు. ఇసుకను అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details