గుడిలో రాజకీయమా!
విజయవాడ దుర్గమ్మ ఆలయంలో రాజకీయ వ్యాఖ్యలు చేయరాదని ఈవో కోటేశ్వరమ్మ హెచ్చరించారు. మరోసారి ఇలా జరిగితే చర్యలు తీసుకుంటామన్నారు.
దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ
ఇంద్రకీలాద్రిపై రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదని దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ పునరుద్ఘాటించారు. ఆలయ ఆధ్యాత్మికత సంరక్షించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని సూచించారు. ఈ ఉదయం ఆలయ ప్రాంగణంలోమంత్రి పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలపై ఆలయ ఈవో స్పందించారు. ప్రతిపక్షమైనా, పాలకపక్షమైనా ఆలయ ప్రాంగణంలో రాజకీయ వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేశారు. ఇకపై ఇలాంటివి జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Last Updated : Feb 27, 2019, 11:57 AM IST