ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డంపింగ్ యార్డు వద్దంటూ మహిళల బైఠాయింపు - డంపింగ్ యార్డు

కృష్ణా జిల్లాలోని సావారీగూడె, వెదురుపావులూరు మహిళలు మానవహారం నిర్వహించి, రహదారిపై బైఠాయించారు. డంపింగ్ యార్డు నిర్మించవద్దని డిమాండ్ చేశారు.

womens darna

By

Published : Jun 1, 2019, 6:29 PM IST

డంపింగ్ యార్డు నిర్మించవద్దని రోడ్డుపై బైఠాయించిన మహిళలు

తమ ప్రాంతంలో డంపింగ్ యార్డు నిర్మించవద్దంటూ.. కృష్ణా జిల్లా గన్నవరం మండలం సావారీగూడెం, వెదురుపావులూరు గ్రామాల మహిళలు ఆందోళన చేశారు. ఇప్పటికే గ్రావెల్ క్వారీలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. మళ్లీ ఈ ఘన వ్యర్థపదర్థాల డంపింగ్ యార్డు నిర్మిస్తే మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గ్రామ ప్రధాన కూడలిలో మానవహారం నిర్వహించి, రోడ్డుపై బైఠాయించారు.

ABOUT THE AUTHOR

...view details