.
మందడంలో మహిళల ఆందోళన... అరెస్ట్ - ఏపీ అసెంబ్లీ వద్ద ఆందోళనలు
రాజధాని అంశంపై ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ మందడంలో మహిళలు రోడ్డుపై బైఠాయించారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలు సచివాలయం వైపు వెళ్తారనే అనుమానంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే తాము ఆందోళన విరమించేది లేదని మహిళలు స్పష్టం చేశారు. ఈ క్రమంలో పోలీసులు కొందరు మహిళలను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ప్రభుత్వ వైఖరిపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మందడంలో మహిళల ఆందోళన... అరెస్టు చేసిన పోలీసులు