బెల్టు షాపులను మూసివేయాలంటూ కృష్ణా జిల్లా అనంతవరంలో మహిళలు ఆందోళన చేశారు. మద్యం సేవించడానికి వచ్చే వారి ఆగడాలు తట్టుకోలేకపోతున్నామని వాపోయారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న మందుబాబులతో కరోనా వ్యాప్తి చెందుతుందని భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో నిరసనలను తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
బెల్టు దుకాణాలు మూసివేయాలంటూ అనంతవరంలో మహిళల ఆందోళన - krishna district news updates
గ్రామంలో బెల్టు దుకాణాలను మూసివేయాలంటూ.. కృష్ణా జిల్లా అనంతవరం గ్రామస్థులు ఆందోళన చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
బెల్టు దుకాణాలు మూసివేయాలంటూ అనంతవరంలో మహిళల ఆందోళన