Protest: నివాసాల మధ్య మద్యం దుకాణం..మహిళల ఆందోళన - ibrahimpatnam crime
21:46 September 16
ఇళ్ల మధ్య మద్యం దుకాణం పెట్టారని మహిళల ఆగ్రహం
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఏ-కాలనీ సెంటర్లో ప్రభుత్వ మద్యం దుకాణాన్ని ప్రారంభించారు. ఇళ్ల మధ్య దుకాణం ఏర్పాటు చేయడంతో స్థానిక మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం దుకాణం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. వెంటనే మద్యం దుకాణం మూసివేయాలని డిమాండ్ చేశారు. మద్యం దుకాణం ఉన్న ప్రాంతంలో పాఠశాల ఉండటంతో విద్యార్థినులు ఇబ్బందులు పడతారన్నారు. ఇళ్ల మధ్యలో ఉండటం వల్ల మహిళలు భయపడుతున్నారని మండిపడ్డారు. ఈ మద్యం దుకాణాన్ని తొలగించి వేరే ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు... ఘటనాస్థలికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పారు.
ఇదీచదవండి.